కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన టెలీ మెడిసిన్ సేవల వేదిక ఈ- సంజీవని ఈరోజుతో మొత్తం మూడు లక్షల సలహా సంప్రదింపులు పూర్తి చేసుకుంది.ఈ టెలిమెడిసిన్ సేవలు రోగులను, డాక్టర్లను భౌతిక దూరం పాటిస్తూ అనుసంధానం చేయడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. తద్వారా కరోనాను కొంతమేరకు కంట్రోల్ చేయవచ్చు.