మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై అమరావతి రైతులు భగ్గుమన్నారు. ఆయన దిష్టిబొమ్మకు శవ యాత్ర నిర్వహించి నిరసన తెలియజేశారు. రాజధాని కోసం మంత్రి కొడాలి ఒక ఎకరమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు? తమ భూమి రాజధానికోసం ఇచ్చి, ఇప్పుడు తామే బాధితులుగా మారామని అన్నారు.