కోవిడ్ ఆస్పత్రులలో 6 నెలల కోసం తాత్కాలిక ప్రాతిపదికన దాదాపు 17 వేల మంది వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియమించడానికి ఉత్తర్వులిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరో 11 వేల మంది శిక్షణ నర్సులను నియమించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు సీఎం జగన్. 28 వేల మంది సిబ్బంది నియామకం వెంటనే పూర్తయ్యేలా చూడాలని, డ్యూటీలో చేరిన వారు సక్రమంగా విధులకు హాజరయ్యేలా కూడా చూడాలని ఆయన కలెక్టర్లతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు.