వచ్చే ఫిబ్రవరి నెలకి కొత్త రథం తయారవుతుందని మంత్రి వెలంపల్లి చెప్పారు. పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా ఉండాలని అన్నారు. అలానే పోలీసు బలగాలను అంతర్వేదికి పంపింది. ఇక్కడ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నం చేసిన 20 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.