నవంబరు 3న అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఉన్న అన్నిమార్గాలను తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతున్నారు.