సీఎం జగన్.. కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా అక్టోబరు రెండున గాంధీ జయంతి నాడు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అదే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు పట్టాల పంపిణీ. నిజానికి ఇది చాలా సాహసోపేతమైన కార్.క్రమమనే చెప్పాలి. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎవరూ ఈ కార్యక్రమం జోలికి వెళ్లలేదని అధికారులు సైతం చెబుతున్నారు.