ఎమ్మెల్యే విడదల రజినికి మస్కా కొట్టాలని చూశాడు ఓ ఆగంతకుడు. ప్రభుత్వ రుణాలు ఇప్పిస్తానంటూ మాట కలిపి తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. వాడి వాలకంపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బైటపడింది. ఎమ్మెల్యే దగ్గర డబ్బులు కొట్టేయాలని చూసిన వాడికోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.