నా చేతిలో 40మంది ఎమ్మెల్యే భవిష్యత్ ఉంది, అన్ని వివరాలూ మా దగ్గరున్నాయి, వారంతా జైలుకెళ్లడం తప్పదు అంటూ చెప్పుకొచ్చారు నారా లోకేష్. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించడంకోసం విజయవాడ వచ్చిన లోకేష్... వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు లోకేష్.