EPFO ఖాతాదారుల అకౌంట్లోకి నేరుగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని రెండు విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. అయితే, మొదట 8.15 శాతం చెల్లించి, మిగిలిన 0.35 శాతం డిసెంబర్లో చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం నిర్వహించిన ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.