నారా లోకేష్ ఓ సంచలనానికి తెరలేపారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయిన లోకేష్...వైసీపీ ఎమ్మెల్యేలు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా ఇళ్ల పట్టాల విషయంలో లెక్కలేనంత అవినీతి చేశారని విరుచుకుపడ్డారు. అలాగే తమ దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని, కనీసం 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్ళడం ఖాయమని, ఎవరిని వదలమని వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తామని చినబాబు భారీ డైలాగులు వేశారు.