విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని, విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని, అలాగే ప్రధాన హైకోర్టు రాజధానిలోనే ఉండాలనే విధానం ఎక్కడాలేదని కేంద్రం తేల్చేసింది. రఘురామకృష్ణంరాజు మాత్రం రాజధాని అంగుళం కూడా కదలదు అన్నట్లు మాట్లాడుతున్నారు. దీని బట్టి చూస్తే కేంద్రం, రాజుగారి మధ్య అండర్స్టాండింగ్ లేదనే అనుకోవాలి. లేదా రాజుగారు కేవలం అమరావతి రైతులని మభ్యపెట్టడానికే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు.