అంతర్వేది ఘటనలో కూడా సోము వీర్రాజు, జగన్పై సుతిమెత్తని విమర్శలు చేసి, బాబుపై మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే ఇదే సమయంలో కొందరు బీజేపీ నేతలు ఏ మాత్రం ఆలోచించకుండా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ ఇంకా పలువురు నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇక దీని బట్టి చూసుకుంటే సోము అధ్యక్షుడు అయ్యాక కూడా, బీజేపీలో రెండు వర్షన్స్ నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.