సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా బాగా ఫ్రస్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. పెద్దగా ఓటమి ఎరగని అయ్యన్న మొన్న ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. పైగా ఇప్పుడు రాజధాని దెబ్బకు అయ్యన్న పోలిటికల్ కెరీర్ దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అయ్యన్న తన ఫ్రస్టేషన్ అంతా చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా ముందుకొచ్చి, వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా విశాఖలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసి రాజకీయం నడిపిస్తున్నారు.