విశాఖపట్నం జిల్లా నాతవరం గ్రామానికి చెందిన ఆశపు శ్రీనివాస్, ఆశపు హనుమాన్సాయి ఇరువురూ అన్నదమ్ములు. స్నేహితుడు అంకంరెడ్డి వంశీకుమార్తో గురువారం తెల్లవారుజామున కారు నేర్చుకునేందుకు వెళ్లారు. మార్గం మధ్యలో కారు అదుపు తప్పి చెట్టుకి ఢీకొనడంతో అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వంశీకి తీవ్ర గాయాలయ్యాయి.