అయితే 2019 ఎన్నికల తర్వాత కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి ఘోరంగానే ఉంది. ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో టీడీపీ జెండా కట్టే నాయకుడే కనిపించడం లేదు. అసలు గత నాలుగు పర్యాయాల నుంచి తిరువూరులో టీడీపీ జెండా ఎగరడం లేదు.