ఏపీ రాజధాని అమరావతి అంశం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మరిన్ని చిక్కులు తెచ్చిందా ? ఇప్పటి వరకు కేంద్ర ఏదో విధంగా ఆదుకుంటుందని, ప్రధాని నరేంద్ర మోడీనే వచ్చి.. ఇక్కడ శంకుస్థాపన చేశారని చెబుతూ వచ్చిన ఆయనకు ఇప్పుడు కేంద్రం వ్యవహరించిన తీరు తీవ్ర శరాఘాతంగా మారింది. ఎవరూ కోరకుండానే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఒకే రాజధాని అని విభజన చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం స్ఫష్టం చేసింది. అదే సమయంలో మూడు రాజధానులకు పరోక్షంగా అంగీకరించింది.