తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 25నుంచి 30రూపాయల మధ్య ఉన్న రేటు.. ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంది. ఇదే నెలలో 50రూపాయలు దాటి, వచ్చే నెలకల్లా ఉల్లి కేజీ 100 రూపాయలకు చేరుతుందని మార్కెట్ వర్గాల అంచనా. నవంబరుకి గానీ కొత్త పంట వచ్చే అవకాశం లేదు కాబట్టి… ఇప్పుడు కనబడుతున్న మార్కెట్ సరళిని బట్టి చూస్తే… వచ్చే నెల నాటికి కేజీ ఉల్లి ధర రూ. 100 కు చేరుతుందని పలువురు వ్యాపారులు అంటున్నారు.