పార్లమెంట్ తాజా సమావేశాల్లో ప్రధాన సమస్యలే చర్చకు వస్తాయి. దేశ ఆర్థిక మందగమనం, కరోనా నివారణ చర్యలు, జీఎస్టీ పంపకాలపైనే ప్రధానంగా ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీయాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ శాసన మండలి రద్దుపై కేంద్రం తొందరపడి నిర్ణయం తీసుకోదని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. సీఎం జగన్ కూడా మండలి రద్దు విషయంలో గతంలో ఉన్నంత పట్టుదలతో లేరని తెలుస్తోంది.