విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వల విషయంలో పవన్ కల్యాణ్ అనుమానాలే నిజమవుతున్నాయి. విశాఖ పట్నం చుక్కవాని పాలెంలో శ్రావణ్ షిప్పింగ్ సంస్థకు పోలీసులు నోటీసులివ్వడంతో ఈ విషయం బైటపడింది. అమ్మోనియం నైట్రేట్ నిబంధనలు- 2012 ని ఉల్లంఘించారంటూ నోటీసులిచ్చారు. పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) అధికారులు ఆయా గోదాముల్లో సోదాలు నిర్వహించి శ్రావణ్ షిప్పింగ్ సంస్థకు నోటీసులిచ్చారు.