నకిలీ పత్రాలతో మొదట బెంగుళూరులోని సప్తగిరి ఆస్పత్రిలో జూనియర్ డీఎంవోగా పని చేశాడు. ఆ తర్వాత  మరెంత తెలివిగా ఏఎస్పీ దేవగిరి అంటూ కొన్ని పోలీస్స్టేషన్లలో తనిఖీలు కూడా చెయ్యడం జరిగింది. హద్దు అదుపు లేకుండా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.ఎన్.రెడ్డి కుమారుడునని పోలీసులని కూడా మోసం చేసాడు. కానీ పోలీసులు విచారణ చేయడంతో నిజం బయటపడింది. ఆ తర్వాత జైల్లో పెట్టడం జరిగింది. జైలు నుండి బయటకి వచ్చాక హైదరాబాద్ నగరంలోని అనేక కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యుడిగా పని చేసాడు.