తోట త్రిమూర్తులు టీడీపీని వీడి ఏడాది దాటేసింది. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు, రామచంద్రాపురంలో టీడీపీ ఇన్చార్జ్ని పెట్టలేదు. దీని వల్ల నియోజకవర్గంలో టీడీపీ కేడర్ వైసీపీ వైపుకు వెళ్లిపోతోంది. చెల్లుబోయిన దెబ్బకు టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. అయితే ఇక్కడ ద్వితీయ శ్రేణి నేతలు సైతం టీడీపీని పట్టించుకోవడం లేడు. ఇప్పటికే కొందరు వైసీపీలో చేరారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ జెండానే కనిపించడం లేడు.