చిత్తూరు జిల్లాలో కరోనా మరణాల రేటు ఆందోళన కలిగిస్తోందని గతంలో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్. ఇటీవల జరిగిన కలెక్టర్ల రివ్యూ మీటింగ్ లో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు, కానీ అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చినట్టు కనపడ్డంలేదు. కేసులు తక్కువగా నమోదవుతున్నా.. మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్న విషయం. రోజుకి కనీసం 8నుంచి 10మంది చిత్తూరు జిల్లాలో కరోనాతో మరణిస్తున్నారు.