లాక్ డౌన్ హీరోగా దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న.. రీల్ విలన్, రియల్ హీరో సోనూ సూద్.. మరో మంచిపని మొదలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన తల్లి పేరిట స్కాలర్ షిప్ అందించబోతున్నారు. పేద విద్యార్థులే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు సోనూ. తన తల్లి, ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరు మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తారు. దీనికోసం scholarships@sonusood.me లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు సోనూ సూద్.