ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. దీపాలు వెలిగించాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపుకి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ముస్లింలు స్పందించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ముస్లింలు కూడా దీపాలు వెలిగించి కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ నిరసన తెలిపారు. ప్రార్థనా స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.