సాధారణంగా అధికార పార్టీలో నాయకులకు కొదవ ఉండదు. అధికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీ నేతలు రావడంతో నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలో నాయకులు కరువైపోతారు. అసలు పార్టీని నడిపించే నాయకుడే కనబడడు. అంటే అధికార పార్టీలో నాయకులు ఎక్కువగా ఉండటం వల్ల ఆధిపత్య పోరు ఉంటుంది. అలాగే ప్రతిపక్షంలో నాయకుడు లేకపోవడం వల్ల అక్కడ ఆ పార్టీకి చాలా కష్టాలు ఎదురవుతాయి.