2019 ఎన్నికల్లో జగన్ కొట్టిన దెబ్బకు కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో టీడీపీ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఇక్కడున్న 16 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఒకటి, టీడీపీ ఒకటి గెలుచుకుంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ వైపు వెళ్ళిపోయారు. దీంతో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ ఎంపీ కేశినేని నానీలు టీడీపీలో మిగిలారు.