పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, మూడు రాజధానులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న వేళ.. వైసీపీ తెలివైన వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని సమస్యలను, గత ప్రభుత్వ అవినీతిని పార్లమెంట్ లో ఎండగట్టడానికి ప్రయత్నిస్తోంది. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో పట్టుబట్టాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది.