’పోలీసులను డిజిపి నియంత్రించలేరా ?’..అంత సమర్ధత లేకపోతే రాజీనామా చేయాలి..ఇవి తాజాగా ఏపీ పోలీసు బాసును ఉద్దేశించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ అక్రమ నిర్బంధం కేసులో పోలీసు వ్యవస్ధను ఉద్దేశించి కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ నాయుకుల గుప్పిట్లో పోలీసు వ్యవస్ధ చిక్కుకున్నంత వరకు సమస్య ఇలాగే ఉంటుంది.