కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దొద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానించింది. సీఎం కేసీఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.