అమరావతి భూకుంభకోణంలో నిందితులుగా ఉన్నవారికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏసీబీ కేసులో విచారణ, దర్యాప్తు నిలిపివేయడంతో నిందితులుగా ఉన్న 13మందికి ఊరట లభించింది. ఎఫ్ఐఆర్లోని విషయాలను ప్రచురించడం గానీ, ప్రసారం చేయడం గానీ చేయకూడదని అరుదైన ఆదేశాలను ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఎఫ్ఐఆర్ కాపీని ప్రచారం చేయడానికి వీళ్లేదని ఆదేశించింది.