రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రెండు సెషన్స్ చొప్పున మొత్తం గా 14 సెషన్లలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది ఏపీ విద్యాశాఖ. కాగా విద్యార్థులు గ్లౌజ్, మాస్క్ ధరించి పరీక్ష కేంద్రానికి రావడంతో పాటు... ఒక నిమిషం నిబంధన అమలులో ఉండటంతో కాస్త ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.