అధికారంలో ఉన్నన్ని రోజులు టీడీపీ కళకళాడిపోయింది. ఇటు టీడీపీ నేతలు, అటు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలతో నిండుగా కనిపించింది. రాష్ట్రమంతా పసుపు మయం అయిపోయేలా నాయకులు నడుచుకున్నారు. అప్పుడు అందరూ నాయకులు బాబు చుట్టూనే ఉన్నారు. ఆయనకు భజన చేస్తూ ప్రత్యర్ధులపై గట్టిగానే విరుచుకుపడ్డారు.