ఏపీ రాజకీయాల్లో కోట్ల ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. దివంగత కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి అనేక కీలక పదవులతో ఏపీ సీఎంగా పనిచేశారు. ఇక విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సైతం ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా సేవలందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో ఏపీలో ఆ పార్టీ క్లోజ్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో చాలామంది కాంగ్రెస్ నేతలు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు.