కేవలం ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరు చేసిన సరికొత్త రికార్డు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో నమోదైంది. మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో నివాసం ఉంటున్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్న 24గంటల లోపే వారికి కార్డు మంజూరైంది. రాష్ట్రంలోనే ఇదో అరుదైన రికార్డుగా మిగిలిపోయింది. వాలంటీర్ శివరామకృష్ణను పలువురు అభినందిస్తున్నారు.