ఈనెల 21నుంచి స్కూల్స్ తెరిచే ఉద్దేశంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం తాజాగా మరోసారి మార్గదర్శకాలను రూపొందించింది. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్ 4 ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవడంపై ఏపీ పాఠశాల విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలోని స్కూళ్లను తెరిపించడంపై దృష్టి సారిస్తున్నాయి.