ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు దురదృష్టం వెంటాడే నేత ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి రాధా అని చెప్పేయొచ్చు. ఒకప్పుడు విజయవాడ రాజకీయాలని శాసించి, కాపు సామాజికవర్గానికి ఒక గుర్తింపు తెచ్చిన వంగవీటి రంగా తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.