2019 ఎన్నికల్లో జగన్ ఇమేజ్ వల్లే వైసీపీ నుంచి 151 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. కేవలం ఆయన కష్టం వల్లే అంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా జగన్ ఇమేజ్‌నే ఎమ్మెల్యేకు శ్రీరామరక్షగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేసే సంక్షేమానికి ప్రజలు మరింతగా వైసీపీకి మద్ధతు ఇస్తున్నారు.