నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయడం కోసం గత టీడీపీ హయాంలో క్షుద్రపూజలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు విజయవాడ కనకదుర్గ ఆలయ చైర్మన్ సోమినాయుడు. అమ్మవారి వెండి రథానికి ఉన్న మూడు సింహాలు కనిపించకపోవడంపై మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన విషయాలను బైటపెట్టారు. నారా లోకేష్‌ను సీఎం చేసేందుకు అదనపు శక్తుల కోసం అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేశారన్న ఆరోపణలు టీడీపీ హయాంలో బలంగా వచ్చాయని చెప్పారు సోమినాయుడు.