కరోనా వైరస్ కేసులు వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వేచిచూసే కోట్లాది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మన దేశంలో 2021 ఆరంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా వ్యాక్సిన్ ప్రయత్నాల్లో నిమగ్నమైందని, మూడు దేశీ కోవిడ్-19 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన రాజ్య సభలో వివరించారు.