నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ నుంచి గెలిచి అదే పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ ప్రభుత్వానికి చురకలు అంటించడం చేస్తున్నారు. ఇక రాజుగారిపై వైసీపీ నేతలు కూడా తీవ్రంగానే ఫైర్ అవుతున్నారు. కానీ రాజు గారు కూడా ఏ మాత్రం తగ్గకుండా వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.