గత కొంతకాలంలో ఏపీలో ఈఎస్ఐ స్కామ్ బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరిగిందని చెప్పి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దీనిపై విచారణ చేయించి, పలువురు అధికారులని అరెస్ట్ చేయించింది. అలాగే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవలే అచ్చెన్న బెయిల్ మీద బయటకొచ్చారు. ఇక ఈ స్కామ్‌లో తాజాగా ఓ ట్విస్ట్ వచ్చి పడింది. ఈఎస్ఐ స్కామ్‌లో ఏ-14గా ఉన్న కార్తిక్ అనే వ్యక్తి మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్‌కు బెంజ్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారని టీడీపీ ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టింది.