అమరావతిలో టీడీపీ నేతలు అడ్డగోలుగా భూకుంభకోణాలకు పాల్పడ్డారని జగన్, వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఈ భూకుంభకోణంపై దృష్టి ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏసీబీ దీనికి సంబంధించి కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో పలువురు టీడీపీ నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. అలాగే టీడీపీ నేతల బినామీలు, తెల్ల రేషన్ కార్డ్ దారులు కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.