ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు. అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ప్రతిపక్ష టీడీపీ కంటే ఎక్కువగానే కన్నా, వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. టీడీపీ టచ్ చేయని కొన్ని అవినీతి ఆరోపణలని సైతం జగన్ ప్రభుత్వంపై చేశారు. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో అవినీతి జరిగిందని కన్నానే మొదట మాట్లాడారు. ఇక కన్నా వ్యాఖ్యలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.