పార్టీలో నేతల పట్ల అధినేతకు విశ్వాసం ఉండాలి. నమ్మాలి. అయితే, ఇది ఎంత వరకు? దీనికి హద్దులు ఉండవా? అతి విశ్వాసం మంచిదేనా? గుడ్డిగా నాయకులను నమ్మడమేనా? అంటే.. ఇలా చేసుకునే పార్టీని నష్టపరుచుకున్నారంటూ.. టీడీపీ తమ్ముళ్లు గళం విప్పుతున్నారు. ``మా నాయకుడు నమ్మితే.. అతిగా నమ్ముతారు. లేకపోతే.. అసలు నమ్మరు. ఇలాంటి పరిస్థితి ఏ పార్టీలోనూ కనిపించదు. దీని వల్లే మేం నష్టపోతున్నాం.`` అని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు.