అమరావతి భూముల కుంభకోణం కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాలను ప్రచురించకుండా మీడియా, సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తాయని అన్నారు విజయసాయిరెడ్డి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరుల ప్రాధమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షిస్తుందని, మీడియా గొంతు నొక్కుతూ హైకోర్టు ఈ కేసులో జారీ చేసిన ఉత్తర్వులు ఆర్టికల్ 19 ద్వారా లభించిన వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాసేవిగా ఉన్నాయని అన్నారాయన.