కరోనా వైద్య సేవల్లో ఎక్కడా ఏ లోటు రాకూడదని, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ తన క్యాంపు ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలో ప్రమాణాలు పెరిగి, మంచి గ్రేడింగ్ వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.