తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి కూడా ఇరుక్కున్నారా ? కుంభకోణంలో ఇరుక్కున్న ఏ14 కార్తీక్ అనే వ్యక్తిని కేసునుండి తప్పించేందుకు+ప్రస్తుతం మళ్ళీ మందుల సరఫరా టెండర్లలో ప్రాధాన్యత ఇచ్చేందుకు మంత్రి గుమ్మనూరు జయరామ్ కొడుకు ఈశ్వర్ ఏకంగా బెంజికారునే బహుమతిగా తీసుకున్నారా ? అనే విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. ఎలాగంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో మంత్రిపై ఆరోపణలు చేశారు. మరో మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ వేదికగా మంత్రి, కొడుకుపై ఆరోపణలు చేస్తే మరికొందరు నేతలు కూడా ఇవే ఆరోపణలు మొదలుపెట్టారు.