ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి షాక్‌లు అలవాటు అయిపోయినట్లున్నాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీని చాలామంది వీడారు. చంద్రబాబుకు షాక్ ఇస్తూ టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. అలాగే గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి,కరణం బలరాంలు ఎమ్మెల్యేలు పదవులు పోకుండా అధికారికంగా వైసీపీలో చేరలేదు.