గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు విచ్చలవిడిగా వైసీపీకి చెందిన నేతలని, ఎమ్మెల్యేలని టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. పదవులకు రాజీనామా చేయించకుండా ఇష్టమొచ్చినట్లు పార్టీలో చేర్చుకుని, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అందుకనే 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని చిత్తుగా ఓడించి, జగన్ని గెలిపించారు. కానీ జగన్ మాత్రం పార్టీ మార్పు వ్యవహారాల్లో నీతిగా నడుస్తున్నారు.