ఒకే ఒక ఓటమి చంద్రబాబుని ఏపీ ప్రజలకు దూరమయ్యేలా చేసింది. అధికారంలో ఉన్నన్ని రోజులు అమరావతి, పోలవరం, ఇన్వెస్ట్మెంట్స్ అంటూ హడావిడి చేసిన బాబు...అధికారం కోల్పోయాక ఆంధ్రప్రదేశ్ మొహం పెద్దగా చూడటం లేదు. ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన వారాల పాలిటిక్స్ చేయడం మొదలుపెట్టారు. కొన్నిరోజులు ఏపీలో ఉండి, వారం ముగింపు అంటే శుక్రవారం హైదరాబాద్కు వెళ్ళిపోయి, మళ్ళీ సోమవారం అమరావతికి తిరిగొచ్చేవారు.